అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఓ విభిన్న ప్రేమకథా చిత్రం రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమా చేయనున్నట్టుగా బన్నీ వాసు ప్రకటించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. తాజా వార్త ఏంటంటే.. మత్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట.

ఆ పాత్ర కోసం నాగచైతన్య ప్ర‌త్యేకంగా హోమ్ వ‌ర్క్ కూడా మొద‌లెట్టాడు. విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోని మ‌త్య‌కారుల‌తో చైతూ భేటీ అయ్యాడు. 2018లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాలు వాళ్ల నుంచి అడిగి తెలుసుకొన్నాడు. ఈ సినిమాలో చైతూ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. అందుకు సంబంధించి త్వ‌ర‌లో లుక్ టెస్ట్ కూడా చేయ‌బోతున్నారని తెలిసింది. ఇందులో నాగచైతన్యకు జంటగా కీర్తి సురేష్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. మరి.. ఈ మూవీతో చైతూ – చందూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *