సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అయితే.. ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. ఈ సంవత్సరం మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని అభిమానులు చాలా పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బర్త్ డేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకోనున్నాడు అంటే.. లండన్ లో అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, ఆయన భార్యాపిల్లలు లండన్ లో ఉన్నారు.

అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ అని సమాచారం. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ పూర్తి అయ్యాకే మహేష్ బాబు హైదరాబాద్ వస్తారట. ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు నాడు గుంటూరు కారం సినిమాకి సంబంధించిన మొదటి పాట విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఆ పాట విడుదల కావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా గురించి ఏదైనా అప్ డేట్ రావొచ్చు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *