మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్‌ తెరకెక్కించిన చిత్రం భోళాశంకర్. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో చిరుకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. టీజర్ అండ్ ట్రైలర్ తో ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఆగష్టు 11న భోళాశంకర్ మూవీని విడుదల చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే.. ఈ నెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారని తెలిసింది. అయితే.. హైదరాబాద్ లోనా..? విజయవాడలోనా..? అనేది ఇంకా క్లారిటీ లేదు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు. మరి.. భోళాశంకర్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *