పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. ఈ నెల 28న థియేటర్లోకి వచ్చిన బ్రో చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే.. ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఈ సందర్భంగా బ్రో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో థమన్ కూడా పాల్గొన్నాడు. బ్రో పాటల విషయంలో ఫెయిల్ అయ్యానంటూ తప్పు ఒప్పుకున్నాడు.

ఇంతకీ థమన్ ఏమన్నాడంటే.. బ్రో సినిమాకి థీమ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సినిమాను కమర్షియల్ గా చూడలేకపోయాను. ఈ కారణంగానే పాటల విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఓ దేవుడిలా చూశాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఈరోజు అంతా అంగీకరిస్తారన్నాడు. పరోక్షంగా బ్రో పాటల విషయంలో ఫెయిల్ అయ్యాననే విషయాన్ని అంగీకరించాడు. అయితే.. తను వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా పవన్ కళ్యాణ్‌ గారి నాలుగు చిత్రాలకు వరుసగా మ్యూజిక్ చేసే అవకాశం రావడానికి త్రివిక్రమ్ గారే కారణమని.. థ్యాంక్స్ తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *