పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. అయితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే – డైలాగ్స్ రాస్తున్నారని తెలిసినప్పటి నుంచి బ్రో మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ ఇది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ మంచి సందేశంతో రూపొందింది. జులై 28న బ్రో చిత్రం భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది.

భారీ వర్షాలు ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. మూడు రోజుల్లో దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ చెప్పారు. సినిమా సక్సెస్ సాధించింది అంటూ బ్రో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో దర్శక నిర్మాతలతో పాటు సాయితేజ్, కేతిక శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హాజరయ్యారు. అలాగే దర్శకులు బాబీ, మారుతి, చందూ మొండేటి, శ్రీవాస్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సినిమా సాధించిన సక్సెస్ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్కండేయ పాత్రను పోషించిన సాయితేజ్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

ఇంతకీ సాయితేజ్ ఏం మాట్లాడారంటే.. డైరెక్టర్ సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా మావయ్య కళ్యాణ్‌ గారి గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడేంత అర్హత కానీ, అనుభవం కానీ లేవు. ఇక థమన్ ఫ్రెండ్ అయినా, నేను తన అభిమానిగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు. అయితే.. బ్రో సక్సెస్ అవ్వాలంటే ఇంకా కలెక్ట్ చేయాల్సింది. అందుచేత ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *