గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగింది. అయితే.. అనుకోకుండా శంకర్ ఇండియన్ 2 పూర్తి చేయాల్సివచ్చింది. ఇక అప్పటి నుంచి గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడుతూ వస్తుంది. ఈ నెలలో గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో చరణ్‌ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంటే.. కీలక పాత్రల్లో శ్రీకాంత్, అంజలి, సునీల్ నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలి అనుకున్నారు. ఆతర్వాత సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. సమ్మర్ లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కవే. కారణం ఏంటంటే.. ఇండియన్ 2 రిలీజ్ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయనున్నారు. అందువలన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే.. చరణ్‌, శంకర్ కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇది నిజమా..? లేక గ్యాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అసలు ఇది నిజమా కాదా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది అనే మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసింది. ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమానే ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తుండగా ఇది కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అన్నట్టుగా ఇప్పుడు ప్రచారం అవుతుంది. కానీ అసలు క్లారిటీ ఏమిటంటే వీరి కాంబినేషన్లో రెండో సినిమా ఏది లాక్ అవ్వలేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్‌ కు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ రావడంతో గేమ్ ఛేంజర్ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి.. గేమ్ ఛేంజర్ మూవీతో చరణ్‌ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *