మాస్ మహారాజా రవితేజ ఆమధ్య వరుసగా ఫ్లాపులతో సతమతమౌతున్నప్పుడు ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ అందించి మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ధమాకా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రవితేజ. అయితే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు రవితేజతో మరో సినిమా చేస్తుంది. అదే.. ఈగల్. ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈగల్ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

అయితే.. ధమాకా, ఈగల్ చిత్రాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాస్ మహారాజా రవితేజతో 100 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందట. ఏంటా ఒప్పందం అంటే.. సినిమాకి 25 కోట్లు చొప్పున నాలుగు సినిమాలకు 100 కోట్లు ఇచ్చిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ దూసుకెళుతుంది. ఇటీవల రవితేజ నటించిన రావణాసుర నిరాశ పరిచింది. ఇప్పుడు ఈగల్ సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించాలి అనుకుంటున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా రానుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డీల్ నిజమే అయితే.. రవితేజతో చేయనున్న మరో రెండు సినిమాలకు డైరెక్టర్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *