పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఆతర్వాత భీమ్లా నాయక్ మూవీతో మరో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఏకంగా నాలుగు సినిమలను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో, ఓజీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ముందుగా ప్రేక్షకుల వచ్చేది బ్రో మూవీ. మేనమామ, మేనల్లుడు పవన్, తేజ్ కలిసి ఫస్ట్ టైమ్ నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు సముద్రఖని అయినప్పటికీ తెర వెనుక డైరెక్టర్ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న బ్రో చిత్రాన్ని జులై 28న విడుదల చేయనున్నారు.

ఇక బ్రో తర్వాత పవన్ నుంచి రానున్న మరో మూవీ ఓజీ. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ మాఫియా డాన్ గా నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఓజీ థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ముంబాయి, హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. జులై లో బ్రో, డిసెంబర్ లో ఓజీ చిత్రాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే కనుక నిజమై.. ఈ సంవత్సరం పవన్ నుంచి రెండు సినిమాలు వస్తే.. ఫ్యాన్స్ కు పండగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *