బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, క్రేజీ హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో యానిమల్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన యానిమల్ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ను టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియన్ మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యానిమల్ ఆగష్టు 11 న విడుదల కానుంది.

ఇంతకీ విషయం ఏంటంటే… యానిమల్ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన రష్మిక మందన్న యూనిట్ సభ్యులతో కలిసి సెట్స్ లో దిగిన పలు పిక్స్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. యానిమల్ టీమ్ తో పని చేసిన అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ హార్ట్ ఎమోజి పోస్ట్ చేయగా ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా యానిమల్ చిత్రం అందరికీ నచ్చుతుందని సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నట్టు చెప్పింది. యానిమల్ మూవీ పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. మరి.. రష్మిక నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *