పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓజీ. ఈ భారీ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓజీ అంటే అర్థం ఏంటో ప్రకటించలేదు కానీ.. ఓజీ అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అని.. అందుకనే ఈ మూవీకి ఈ టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంది. అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఇప్పుడు ఓజీ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే… ఈ చిత్రంలో పవన్ క్యారెక్టర్ పేరు గాంధీ అనే పేరుతో ఉంటుందట. ఇందులో శ్రియా రెడ్డికి సుజిత్ ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. ఇది పవన్ కు వదిన పాత్ర అని.. వీరిద్దరి పై వచ్చే సన్నివేశాలు కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ కి షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనేది ప్లాన్. మరి.. ఓజీ సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *