నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టర్. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇందులో బాలయ్యకు జంటగా సీనియర్ హీరోయిన్ కాజల్ నటిస్తుంటే.. కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుకుంటుంది. ఆగష్టుకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా సెట్ లో కాజల్, శ్రీలీల చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో అనిల్ రావిపూడి.. బాలయ్య బాలయ్య గుండెల్లో గొలయ్య సాంగ్ కు అద్దిరిపోయే స్టెప్స్ వేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య మరో సాంగ్ అయిన చిలక పచ్చ కోకా సాంగ్ కు కాజల్, శ్రీ లీల మాస్ స్టెప్స్ వేశారు. ఈ వీడియోలో కాజల్, శ్రీలీలతో పాటు అనిల్ రావిపూడి కూడా కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. భగవంత్ కేసరి చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link&igshid=MWQ1ZGUxMzBkMA==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *