నిఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల శర్వానంద్ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని.. హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కూతురుతో రామ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. దీంతో రామ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఇదే విషయం గురించి రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ ను అడిగితే.. అలాంటిది ఏమీ లేదు. మ్యారేజ్ ఫిక్స్ అయితే… మేమే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే… ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఇటీవల మైసూర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దీంతో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మూవీ చేయనున్నారు. ఇది కూడా భారీ పాన్ ఇండియా మూవీనే. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్లేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశాడు. మరి.. రామ్ కి పెళ్లి కల ఎప్పుడు వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *