బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించి దేశవిదేశాల్లో సైతం మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా అంతలా సక్సెస్ అవ్వడానికి కారణం రాజమౌళి అని ప్రభాస్ గొప్పతనం ఏమీ లేదని కొంత మంది విమర్శించారు. అయితే… బాహుబలి తర్వాత సాహో సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ.. ప్రభాస్ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ కంటే బాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన రాధేశ్యామ్ యాక్షన్ మూవీ కాదు.. ప్రేమకథా చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది.

అయితే.. ఇప్పుడు ఆదిపురుష్ అంటూ వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ పై విమర్శలు వచ్చినా మొదటి రోజు మాత్రం 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే.. బాహుబలి 2 చిత్రం ఫస్ట్ డే 215 కోట్లు, సాహో 125 కోట్లు, ఆదిపురుష్ 140 కోట్లు కోట్లు కలక్ట్ చేశాయి. ఈవిధంగా ఫస్ట్ డేనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రాలు మూడు ఉన్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ సినీ అభిమానులు అందరూ అభినందిస్తుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *