పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ఆదిపురుష్‌. ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా, సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్ చిత్రానికి అన్ని ఏరియాల్లో మిక్సిడ్ టాక్ వచ్చింది. ఓంరౌత్.. సరికొత్త రామాయణం చూపించడం పై ఇదేం రామాయణం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే.. ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఆదిపురుష్‌ సినిమా గురించి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పందించాడు. ఇంతకీ సందీప్ రెడ్డి ఏమన్నాడంటే.. ఆదిపురుష్ గురించి అన్ని గొప్ప విషయాలు వింటున్నాను. ఈ ఎపిక్ ఇండియాలో అద్భుతమైన VFX వండర్ అని అన్నారు. నిర్మాత భూషణ్ కుమార్ కి, డైరెక్టర్ ఓం రౌత్ కి, హీరో ప్రభాస్ కి కంగ్రాట్స్ తెలిపారు. సినిమా ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడనే టాక్ వచ్చింది. మూడు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయి. సోమవారం అసలు పరీక్ష. మరి.. ఆదిపురుష్ మండే టెస్ట్ పాస్ అవుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *