ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప రూపొందడం ఈ సినిమా సంచలనం సృష్టించడం తెలిసిందే. టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. దీంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 టీజర్ రిలీజ్ చేస్తే.. తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది. దీనిని బట్టి పుష్ప 2 కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే… అంచనాలకు మించి పుష్ప 2 ఉండాలని సుకుమార్ కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. ప్రతి సీన్ ఇంట్రస్టింగ్ గా ఉంటూ వాట్ నెక్ట్స్ అనేలా చాలా ఎగ్జైయింటింగ్ గా ఉంటుందట. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. ఈ సీన్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. రష్మిక పాత్రకు ఈ ట్విస్ట్ తో లింకు ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి.. పుష్ప 2 ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *