పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే సర్వర్ క్రాష్ అయ్యిందంటే.. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది అనేదే హాట్ టాపిక్ అయ్యింది. పీవీఆర్ సంస్థ ఏకంగా లక్ష టిక్కెట్లు అమ్మినట్టు ప్రకటించింది. నార్త్ లో ఈ సినిమా ఫస్ట్ డే 30 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సౌత్ లో 80 కోట్లు వస్తుందని అంచనా.

టోటల్ గా మొదటి రోజు 110 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా వేస్తున్నారు. టీజర్ తో విమర్శలు అందుకున్న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి రోజురోజుకు అంచనాలు పెంచేసింది. ప్రీ రిలీజ్ తర్వాత ఆకాశమే హద్దు అనేలా క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే, థర్డ్ డే ఇంకా భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఒక నెల వరకు సరైన సినిమా లేకపోవడం ఆదిపురుష్‌ కి బాగా కలిసొచ్చే అంశం. అందుచేత ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం.. చరిత్ర సృష్టించడం ఖాయం అని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *