ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నోట విన్నా ఆదిపురుష్ గురించే.. ఈ క్రేజీ మూవీలో ప్రభాస్ రాముడుగా నటిస్తే… కృతి సనన్ సీతగా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. టీజర్ రిలీజ్ తర్వాత విమర్శలు వచ్చాయి కానీ.. ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ప్రీ రిలీజ్ తర్వాత నుంచి అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే.. ఈ సినిమా గురించి కృతి సనన్ స్పందించింది. తన కెరీర్ లోనే ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆదిపురుష్ అని చెప్పింది.

ఇక ప్రభాస్ గురించి చెబుతూ… రాముడుగా ప్రభాస్ తప్పితే మరో నటుడు ఎవరూ కూడా నటించలేరు. రాముడు పాత్రలో ప్రభాస్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. రాముడుగా, సీతగా నటించే అవకాశం లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. ఆ అదృష్టం మాకు దక్కింది అంటూ తన మనసులో మాటలు బయటపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్ లో ఆదిపురుష్ కు అద్బుతమైన స్పందన లభించింది. ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరి.. ఆదిపురుష్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *