సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఏఎంబి అంటూ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయడం.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏఏఏ పేరుతో అమీర్ పేటలో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు. ఈ మల్టీప్లెక్స్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో ఓపెన్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ శుక్రవారం ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఈ భారీ చిత్రం బుకింగ్స్ అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓపెన్ కాగా ఆదిపురుష్ 3డి వెర్షన్ లో అయితే సెన్సేషనల్ బుకింగ్స్ ని సెట్ చేస్తుంది. బుక్ మై షోలో అయితే.. ఆదిపురుష్ టికెట్స్ హాట్ కేకులు లా అమ్ముడు పోయాయి. ఇక ఈ సినిమాతోనే ఓపెన్ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్స్ ఏఏఏ సినిమాస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి మాస్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం నిమిషాల్లోనే బుకింగ్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. దీనిని బట్టి రెస్సాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బుకింగ్స ట్రెండ్ చూస్తుంటే.. ఆదిపురుష్ ఫస్ట్ డే సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *