మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకోవడం.. పెళ్లి వరకు రావడం.. ఎంగేజ్ మెంట్ జరగడం తెలిసిందే. ఇన్నాళ్లు ఎవరికీ ఏమాత్రం తెలియకుండా సైలెంట్ గా లవ్ ట్రాక్ నడిపారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సంవత్సరం చివరిలో వీరిద్దరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే… ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి లావణ్య త్రిపాఠే మెగా ఫ్యామిలీకి ఓ కండీషన్ పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఆ కండీషన్ కి మెగా ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాతే మ్యారేజ్ కి ఒప్పుకుందట.

ఇంతకీ ఏంటా కండీషన్ అంటే… లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ… ప్రొడక్షన్ వైపు మాత్రం వెళ్తానని చెప్పిందట. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ ఒప్పుకుందట. అందుకనే వరుణ్‌ తో మ్యారేజ్ కి ఓకే చెప్పిందని టాక్. డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. త్వరలోనే పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ..? అనేది ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *