సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఖుషి ఒకటి. ఇప్పుడు ఈ చిత్రానికి అదే టైటిల్ పెట్టడంతో ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే.. ఇటీవల ఈ మూవీ నుంచి నా రోజా నువ్వే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం పై ఉన్న అభిమానంతో ఆయన సినిమా టైటిల్స్ తో ఈ పాటను రాయడం.. అది కూడా డైరెక్టర్ శివ నిర్వాణ రాయడం విశేషం. ఈ పాటను ఇలా రిలీజ్ చేశారో లేదో… అలా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. విన్నవెంటనే నచ్చేసిన ఈ పాట యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండడంతో ఐదు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ఈ పాట అలరిస్తుంది. ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *