మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ చిరుతో సినిమా చేసేందుకు ఓ కథ చెప్పడం.. ఆ కథ నచ్చి ఓకే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆగష్టులో చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండే సోషియో ఫాంటసీ మూవీ అని.. జ‌గ‌దేక వీరుడులో స్వ‌ర్గం నుంచి.. శ్రీ‌దేవి దిగి వ‌స్తుంది. ఇక్క‌డ కూడా అలాంటి సెట‌ప్పే ఉంద‌ని టాక్‌. కాక‌పోతే.. స్వ‌ర్గం నుంచే కాదు.. ముల్లోకాల నుంచీ.. హీరో కోసం క‌థానాయిక‌లు భూమ్మీద‌కు దిగుతార‌ని స‌మాచారం. అందుకే ఈ సినిమాకి ముల్లోక వీరుడు అనే పేరు పెట్టాల‌ని ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. టైటిల్ విషయంలో చిరు నిర్ణయం తీసుకోవాల్సివుంది. దాదాపుగా ఈ టైటిలే ఫిక్స్ అని టాక్ బలంగా వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *