నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూవీ అంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే టాక్ ఉంది. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరోకటి సక్సెస్ సాధించడంతో ఈ క్రేజీ కాంబోలో మరో మూవీ చేయాలి అనుకున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బోయపాటితో సినిమాని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. బోయపాటితో కాకుండా బాబీతో సినిమాని అనౌన్స్ చేసి అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చారు బాలయ్య. అయితే.. బోయపాటితో బాలయ్య అఖండ 2 సినిమా ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది.

అఖండ 2 స్ర్కిప్ట్ రెడీగా ఉందట. కాకపోతే బోయపాటి రామ్ తో చేస్తున్న సినిమాలో బిజీగా ఉండడం వలన ప్రస్తుతానికి పక్కనపెట్టారట. బాలయ్య ఎన్నికల హడావిడి అయిపోయిన తర్వాత 2024లో అఖండ 2 చేయాలని ఫిక్స్ అయ్యారట. బోయపాటి కూడా 2024లో అఖండ 2 చేసేందుకు ఓకే చెప్పారట. అలా ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే బాబీతో మూవీని ప్రకటించారట. అఖండ సినిమాకు మించి అఖండ 2 ఉంటుందట. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు పలువురు నిర్మాతలు పోటీపడుతున్నారట. ఎవరి బ్యానర్ లో చేయాలి అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *