మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం.. తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు డెస్టినేషన్ మ్యారేజ్ లే చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి జైపూర్ లో జరిగింది. వరుణ్ తేజ్, లావణ్యలు కూడా ఓ మాంచి డెస్టినేషన్ స్పాట్ లో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని కోసం పెద్ద లిస్టే తయారు చేసుకున్నారట కానీ.. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇటలీ అని తెలిసింది.

ఇటలీలోనే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంటే… వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది ఇటలీలోనే అట. మిస్టర్ షూటింగ్ కి ఇటలీ వెళ్లినప్పుడు స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారడం జరిగిందట. అందుకే ఇటలీలో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారని సమాచారం. ఇంతకీ.. పెళ్లి ఎప్పుడు అంటే.. ఈ సంవత్సరంలోనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట. మొత్తానికి వరుణ్, లావణ్య ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్లు ఇంత స్టోరీ నడిపారా అని కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా సర్ ఫ్రైజ్ గా ఫీలవుతుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *