సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు న్యూలుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే.. వావ్.. ఇంత అందంగా ఉన్నాడేంటి..? వయసు పెరుగుతున్నప్పుడు అందం తగ్గాలి కదా.. మహేష్ విషయంలో ఇది రివర్స్ లో పని చేస్తుందా..? అనిపిస్తుంది.

గుంటూరు కారం సినిమా సెట్ లో స్టిల్సా..? లేక ఏదైనా యాడ్ లో స్టిల్సా..? తెలియదు కానీ.. మహేష్ బాబు మాత్రం కొత్త లుక్ లో అదరగొట్టేసాడు అంతే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఇతనికి పెళ్లై… ఇద్దరు పిల్లలు ఉన్నారంటే.. నమ్మలేం. ఆ పిల్లలకే అన్నయ్యలా ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారంటే.. ఎంత అందంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయనున్నాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *