దగ్గుబాటి రానా టెక్నీషియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. డిజిటిల్ ఇంటర్మీడియట్ అనే కొత్త టెక్నాలీజీ వచ్చిన కొత్తలో దానిపై బాగా వర్క్ చేశాడు. ఇక టెక్నీషియన్ గానే ఉంటాడు అనుకుంటే.. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే.. హీరో అవ్వాడనికి ముందు బొమ్మలాట అనే చిన్న సినిమా నిర్మించాడు. రెండు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆతర్వాత నటన పై దృష్టిపెట్టాడు. అయితే.. ఇప్పుడు మళ్లీ నిర్మాణ రంగం వైపు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆమధ్య నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హీరోగా కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు కానీ.. ఇక నుంచి నిర్మాతగా రాణించాలి అనుకుంటున్నాడట. బాలీవుడ్ హీరో వరుణ్ థామన్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో సునీల్ నారంగ్ కూడా పార్టనర్ గా జాయిన్ కానున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో కూడా రానా ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి రానా రూటు మారిందని టాక్ బలంగా వినిపిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *