జార్జిరెడ్డి ఫేమ్ అభయ్ బేతిగంటి నటిస్తూ.. దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఇందులో అభయ్ యూత్ లీడర్ రాజు పాత్రలో నటించాడు. ఆమధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేశారు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నటించిన అభయ్, మరో నటుడు విష్ణుకు మధ్య గొడవ రావడం.. ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇంతకీ గొడవ ఏంటంటే… ఈ సినిమాలో తనని లీడ్ క్యారెక్టర్ కి తీసుకుని పోస్టర్స్ లో మాత్రం తన ఫోటో ఒక్కటి కూడా పెట్టలేదని.. ఇది కరెక్ట్ కాదని నటుడు విష్ణు తన బాధను తెలియచేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. దీనికి అభయ్.. తనకు ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్లనే పెట్టుకుంటాను. వాళ్ల ఫోటోలనే పోస్టర్లో వేస్తాను.. నువ్వు ఇలా మాట్లాడతావని ఊహించలేదు అంటూ వీడియో రూపంలోనే సమాధానం ఇచ్చాడు. ఇలా అభయ్, విష్ణు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే.. రామన్న యూత్ అనే సినిమా ఇప్పుడు ఈ గొడవ కారణంగా వార్తల్లోకి రావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *