సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం. జీఏ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. జీఏ 2 బ్యానర్ లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలి అనుకున్నారు కానీ.. విజయ్, పరశురామ్ కాంబోలో దిల్ రాజు సినిమాని ప్రకటించారు.

అయితే.. గీత గోవిందం సినిమాలో విజయ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక నటించింది. ఇప్పుడు తాజాగా చేయనున్న మూవీలో బుట్టబొమ్మ అదేనండి.. పూజా హేగ్డేను తీసుకుంటున్నారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది గీత గోవిందం సీక్వెలా..? లేక కొత్త సినిమానా..? అనేది ఆసక్తిగా మారింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ప్రస్తుతానికి ఇది సస్పెన్స్. త్వరలోనే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *