ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? గత కొంతకాలంగా సమాధానం లేని ప్రశ్నగా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అని కృష్ణంరాజు ప్రకటించారు. బాహుబలి, బాహుబలి 2 కూడా వచ్చి వెళ్లిపోవడం జరిగింది కానీ.. ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. అడిగిన ప్రతిసారీ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అంటూ తప్పించుకునేవారు. అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. మామధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ప్రకటించారు. ఆతర్వాత కృతి సనన్ తో ప్రభాస్ లవ్ లో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అప్పుడు కూడా మేమిద్దరం కేవలం ప్రెండ్స్ మాత్రమే అని చెప్పారు.

ఇలా ప్రభాస్ పెళ్లి ఎప్పుడో సమాధానం లేని ప్రశ్నకు కాస్త సమాధానం దొరికింది అని చెప్పచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. దీనికి సమాధానంగా ఖచ్చితంగా చేసుకుంటాను.. ఇక్కడే తిరుపతిలో చేసుకుంటాను అని అనౌన్స్ చేశారు. అయితే.. ఎప్పుడు చేసుకుంటాడు..? ఎవర్ని చేసుకుంటాడు..? అనేది మాత్రం ప్రకటించలేదు. ప్రభాస్ చెప్పడం బట్టి త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి.. ఎవర్నీ చేసుకుంటాడో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *