ఊర్శశీ రౌటేటా.. ఈ మధ్య ఈ అమ్మడు పేరు బాగా వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ సాగే పాటలో మెరసింది. కుర్రకారును బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీలో కూడా స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ రౌటేలా నటించింది. ఇలా టాలీవుడ్ లో ఐటం సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ చేయాలంటే ఊర్వశీ రేటేలా మైండ్ లోకి వస్తుంది. దీనిని బట్టి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ దక్కించుకుందనే టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో రూపొందుతున్న మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు కానీ.. ఈ అమ్మడు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దీంతో ఊర్వశీ రౌటేలాను కాంటాక్ట్ చేస్తే.. వెంటనే ఓకే చెప్పింది. పవన్, తేజ్ ల పై వచ్చే సాంగ్ ఇది. ఈ సాంగ్ ఊర్వశీ రౌటేలాకు మంచి పేరు తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *