పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతి సనన్ సీతగా నటించింది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు బొమ్మల సినిమాలా అనిపించింది కానీ.. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఆదిపురుష్ పై అమాంతం అంచనాలు పెరిగాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. తిరుపతిలో జూన్ 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు అంతా రెడీ అయ్యింది. మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్.. ఇరవై ఏళ్ల నుంచి ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు.. అంటాడు. ఇది ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు కరెక్ట్ గా సరిపోతుంది. ప్రీ రిలీజ్ వేడుకలో చేయడంలో ఇరవై ఏళ్ల నుంచి ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక ఇది.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక అని అభిమానులు గర్వంగా.. గట్టిగా చెప్పేలా.. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా వావ్ అనేలా ఏర్పాట్లు చేశారు. మరి.. ప్రీ రిలీజ్ వేడుకే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయితే.. ఆదిపురుష్‌ థియేటర్లు దేవాలయాలుగా అవ్వడం.. జై శ్రీరామ్ అనే నామం మారుమ్రోగం.. కలెక్షన్ ల వర్షం కురవడం ఖాయం అని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *