ప్రభాస్ మరియు కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా విడుదల తేదీకి రోజులు లెక్కపెడుతున్నారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇవాల్టి నుంచి కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో, ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎంతో కోపంగా, చేతిలో గధ పట్టుకొని కనిపిస్తున్న హనుమంతుడి పోస్టర్ ఈరోజు విడుదల చేశారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్,యూ వీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ మరియు కృతి సనన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగర్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ సినిమా విడుదల కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా
ఎడిటర్ : అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే,
డివోపి : కార్తీక్ పల్నాని
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
సంగీతం : సచేత్-పరంపర  
నిర్మాతలు : టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్, వంశీ , ప్రమోద్
సమర్పకులు : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్
దర్శకత్వం : ఓమ్ రౌత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *