హ్యాపీడేస్ మూవీలో నలుగురులో ఒక్కడుగా రాజేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు నిఖిల్. ఆతర్వాత యువత, స్వామి రారా, కార్తికేయ తదితర చిత్రాలతో మెప్పించిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లోఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. నిఖిల్ ఏంటి తన సినిమాతో 100 కోట్లు సాధించడం ఏంటి అని అంతా షాక్ అయ్యారు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశాడు. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ ఎవరితో చేస్తాడనుకుంటే.. నిఖిల్ తో ది ఇండియా హౌస్ అని ప్రకటించి అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. ఇది పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్వయంభూ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఇలా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ షాక్ ల మీద షాక్ ఇస్తున్నాడు. ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే నిఖిల్ కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *