యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రంలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారనీ తనూ పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ల వద్ద ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. సరే అని మైక్ ఇచ్చారు. తీరా అతన పాడుతేంటే ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్‌ వాయిస్ వినిపిస్తోంది. మరి ఇదెలా సాధ్యం అంటే.. సింపుల్.. ఈ మూవీ కోసం నిజంగానే ధనుష్ పాట పాడాడు.

అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చూశాం. కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ పాటకోసం ధనుష్‌ను దాని కోసం తీసుకువచ్చారు.”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట.. ఆకట్టుకునేలా ఉంది. మే 31న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ధనుష్‌ పాడుతున్న లిరికల్ వీడియో కూడా వస్తుంది.

ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో

తారాగణం :

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : యూవీ క్రియేషన్స్

ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,

విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు

సంగీతం : రధన్

సినిమాటోగ్రఫీ : నీరవ్ షా

పిఆర్వో : జీఎస్కే మీడియా

నిర్మాతలు : వంశీ – ప్రమోద్

రచన, దర్శకత్వం : మహేష్‌ బాబు.పి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *