మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అతను ఏ భాషలో నటించినా, అక్కడి సంస్కృతికి తగ్గట్లుగా తనను తాను మలచుకొని, ఆ మట్టిలో పుట్టిన వ్యక్తిగానే అందరికీ చేరువ అవుతారు.

తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరైన దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కోసం యువ సంచలనం, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలుపుతున్నారు. సార్/వాతి తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మాణంలో సినిమా చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి అత్యుత్తమ నాణ్యత, కంటెంట్‌తో కూడిన అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నాయి. వినోదాన్ని అందించడంతో పాటు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రాలను అందించడానికి వారు కృషి చేస్తున్నారు.

ఈ చిత్రం కూడా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరించే మరో క్వాలిటీ మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అవుతుంది.

అద్భుతమైన కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ 2023, అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *