విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రానున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే.

సోమవారం (మే 8) రోజున తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘లాల్ సలాం’ చిత్రంలో పోషిస్తోన్న ‘మొయిద్దీన్ భాయ్’ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లుక్‌ను గ‌మ‌నిస్తే ముస్లిం గెట‌ప్‌లో ర‌జినీకాంత్ రాయ‌ల్‌గా న‌డిచివ‌స్తున్నారు. తలైవ‌ర్ మాస్ గెట‌ప్ ఓ రేంజ్‌లో ఉంది. బాషాలో మాణిక్ బాషాగా అల‌రించిన మ‌న సూప‌ర్ స్టార్ ఇప్పుడు లాల్ స‌లాంలో మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించ‌బోతున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ చిత్రాల‌ను అందించ‌టానికి మా లైకా ప్రొడ‌క్ష‌న్ష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాల్ స‌లాం విష‌యానికి వ‌స్తే ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌గారి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌గారు మొయిద్దీన్ భాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో రాకింగ్ పెర్ఫామెన్స్‌తో ఈ చిత్రంలోనూ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటార‌న‌టంలో సందేహం లేదు. . ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.

నటీనటులు :

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్

హెడ్ అఫ్ లైకా ప్రొడక్షన్స్ :

నిర్మాత సుభాస్క‌ర‌న్‌

బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు రంగస్వామి

ఎడిటింగ్‌: బి.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌

ఆర్ట్‌: రాము తంగ‌రాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *