కమెడియన్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈయన..ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు. తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేసాడు. క్రాంతి హీరోగా నటిస్తుండగా పృద్వి కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం చేస్తూ శ్రీ పిఆర్ మూవీస్ బ్యానర్‌‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మించిన చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా నటుడు నాగబాబు “కొత్త రంగుల ప్రపంచం’ టీజర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన

నటుడు సుమన్ మాట్లాడుతూ..కొత్త రంగుల ప్రపంచం’ టీజర్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది.నటుడు పృద్వి మంచి కథను సెలెక్ట్ చేసుకొని దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో, హీరోయిన్ లు కొట్టవారైనా చాలా బాగా నటించారు. కొత్త వారు అని చూడకుండా కథను నమ్మి తీసిన ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర నిర్మాతలు పద్మ రేఖ,గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి లు మాట్లాడుతూ.. పృద్వి గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాము. మా సినిమా ద్వారా పృద్వి గారి కూతురు హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన వారంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన మా ‘కొత్త రంగుల ప్రపంచం’.సినిమా టీజర్ ను విడుదల చేసిన నాగబాబు కు ధన్యవాదాలు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ..నేను చెప్పిన కథ నచ్చడంతో ఏ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు నిర్మాతలు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే హీరో గా పరిచయం అవుతున్న క్రాంతి చాలా బాగా నటించాడు. మరియు హీరోయిన్ గా పరిచయం అవుతున్న మా అమ్మాయి శ్రీలు కూడా ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు లిక్విడ్ డైట్ చేసి ఆ ఆతరువాత హీరోయిన్ గా పర్ఫెక్ట్ అన్న తరువాతే నటించింది. ఈ సినిమాలో తన నటనను చూసిన సెన్సార్ వారు సైతం మీ అమ్మాయిలో మరో విజయశాంతి ను చూశాము చాలా బాగా నటించింది అని మెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా వస్తున్న వీరిద్దరినీ ప్రేక్షకులకు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సినిమాకు శివారెడ్డి చక్కటి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ఆదిత్య అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇందులో నటించిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. మా సినిమా చూసిన వారు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ.. మా నాన్న దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నన్ను మీరందరు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో క్రాంతి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు

క్రాంతి (హీరో )శ్రీలు(హీరోయిన్ ),విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : శ్రీ పిఆర్ క్రియేషన్స్

నిర్మాతలు: పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి

దర్శకత్వం : పృథ్వి రాజ్

కెమెరామెన్ : శివారెడ్డి

పి ఆర్ ఓ : గణేష్ , ధీరజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *