ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ కు ఇండియాస్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ నుంచి అద్భుతమై స్పందన వచ్చింది. ఈ టీజర్ తమకు ఎంతో నచ్చిందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క నటించిన టీజర్ కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించబడింది మరియు దీనికి గొప్ప స్పందన వచ్చింది.

విడుదలైన కొన్ని గంటల్లోనే టీజర్ వైరల్ అయింది. అద్భుతంగా ఉందనే ప్రశంసలతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉందనే ఎంకరేజ్మెంట్స్ కూడా వచ్చాయి. అనుష్క చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ నుంచి శుభాకాంక్షలు రావడం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్.

లేటెస్ట్ గా రామ్ చరణ్‌ కూడా టీజర్‌ను మెచ్చుకుంటూ “#MissShettyMrPolishetty టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌గా కనిపిస్తోంది 😃 మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు.

ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ టీజర్ ను హైప్ చేయడంతో మూవీ టీమ్ కు పెద్ద బూస్టప్ గా నిలిచిందని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది.

ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో

తారాగణం :

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : యూవీ క్రియేషన్స్

ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,

విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు

సంగీతం : రధన్

సినిమాటోగ్రఫీ : నీరవ్ షా

పిఆర్వో : జీఎస్కే మీడియా

నిర్మాతలు : వంశీ – ప్రమోద్ – విక్రమ్

రచన, దర్శకత్వం : మహేష్‌ బాబు.పి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *