రౌడీబాయ్స్ చిత్రంతో నటుడిగా అందరి ఆదరణ పొందిన ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫిష్. పాతబస్తీ కుర్రాడిగా పూర్తి మాస్ పాత్రలో ఆశిష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుండి మే 1న కథానాయకుడు ఆశిష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి దిల్‌ఖుష్ అనే తొలి లిరికల్ వీడియో పాటను విడుదల చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన ఈ పాట మిక్కి.జే.మేయర్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో ఆశిష్ మాస్‌లుక్‌లో బిందాస్ అటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పాత్రబస్తీ కుర్రాడిగా పూర్తి వైవిధ్యంగా, నేటి యువతరానికి నచ్చే విధంగా ఆశిష్ పాత్ర ఫుల్ మాసివ్‌గా ఎంటర్‌టైనింగ్ వుండబోతుందని ఈ పోస్టర్‌లో ఆశిష్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రలో ఇవనా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికందన్, సంగీతం: మిక్కి.జే.మేయర్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, పీఆర్వో: వంశీ- శేఖర్, మడూరి మధు కోప్రొడ్యూసర్స్ : హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, రచన-దర్శకత్వం: కాశీ విశాల్, నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *