ఈ సమ్మర్ లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకుడు. ఎస్కేఎన్ నిర్మాత. బేబీ చిత్ర టీజర్ తో పాటు రెండు పాటలకూ ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈగర్ గా చూస్తున్నారు ప్రేక్షకులు.

ప్రస్తుతం ప్రమోషన్స్ లో వేగం పెంచిన బేబీ మూవీ టీమ్ లేటెస్ట్ గా శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఫెస్ట్ కు చీఫ్ గెస్ట్ లు వెళ్లారు. కాలేజ్ మొత్తం ఈ మూవీకు అద్భుతమైన స్వాగతం పలికింది. ఆనంద్, వైష్ణవి లతో పాటు నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. 

ఈ సందర్భంగా బేబీ మూవీ నుంచి థర్డ్ లిరికల్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఓ రెండు ప్రేమ మేఘాలు, దేవరాజా అనే పాటలు అందరి ప్లే లిస్ట్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. రాబోయే మూడో పాట కూడా అంతకు మించి అనేలా ఉండబోతోందని తెలిపారు.

ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు.

టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *