సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో …

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ‘‘‘విరూపాక్ష’ సినిమా స‌క్సెస్ నాదో, మా టీమ్‌దో కాదు. మన ఆడియెన్స్‌ది. గ‌త ఏడాది కొన్ని సినిమాల‌కు జ‌నాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు చాలెంజ్ విసిరారు. మేం థియేట‌ర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండ‌ని చెప్పారు. ఆ చాలెంజ్‌కి ఆన్స‌రే విరూపాక్ష‌. ద‌య‌చేసి అంద‌రూ థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూడండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ఇది. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. ప‌ప్పుగారు డ‌బ్బింగ్ విష‌యంలో ఎంత‌గానో హెల్ప్ చేశారు. నాకు యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు సాయంగా నిల‌బ‌డిన డాక్ట‌ర్స్‌కి థాంక్స్‌. వారు నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చారు. మా ముగ్గురు మావ‌య్య‌ల‌కు థాంక్స్‌. మారుతిగారికి, గోపన్న‌గాకు థాంక్స్‌. మీడియా కూడా ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను తీసుకెళ్ల‌టానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘నేను ప్రతిరోజూ పండగే సినిమా సమయంలో ప్రేమకథా చిత్రమ్ సినిమా చూశావా తమ్ముడు అని తేజ్‌ని అడిగితే అన్నా! అందులో దెయ్య‌ముందంట క‌దా! నేను అలాంటి జోన‌ర్‌లో సినిమాలు చెయ్య‌నే చెయ్య‌ను అనేశాడు. త‌ర్వాత ఓ రోజు అన్నా హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఓ క‌థ‌విన్నాను. అద్భుతంగా వుంది. చేసేస్తున్నానని అన్నాడు. అస‌లు నేను ఆ జోన‌ర్‌లోనే సినిమా చేయ‌ను అని అనుకున్న హీరోని సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన డైరెక్ట‌ర్ కార్తీక్‌కి అభినంద‌న‌లు. త‌ను సినిమాను ఓకే చేసినప్పుడే సినిమా హిట్ అని అనుకున్నాను. త‌ను ఇలాంటి జోన‌ర్‌లో మూవీస్ చేయాల‌ని అనుకుంటున్నాను. మంచి గురువుంటే మంచి శిష్యులు వ‌స్తారు. ఇప్పుడు సుకుమార్‌గారిని చూస్తే అదే అనిపిస్తుంది. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. సుకుమార్ గారి శిష్యుడు అనిపించుకోవాల‌ని అంద‌రూ పోటీ ప‌డుతున్నారు. అదొక క్వాలిఫికేష‌న్ అయ్యింది. కార్తీక్‌ను చూసిన‌ప్పుడు ఇంత సాఫ్ట్‌గా ఉన్నాడేంట‌నిపించింది. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు ఇంత సైకిక్ యాంగిల్ ఉందా! అనిపించింది. త‌ను అనుకున్న క‌థ‌ను ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడ‌నేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అందుకే ఈ స‌క్సెస్ వ‌చ్చింది. త‌నింకా మంచి సినిమాలు చేస్తాడ‌ని అనుకుంటున్నాను. మార్నింగ్ షో త‌ర్వాత మూవీకి క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి. ఈ జోన‌ర్ మూవీస్ అంతే. అలాంటి జోన‌ర్లో సినిమా చేసి ఈరోజు స‌క్సెస్ కొట్టారు. 24 క్రాప్ట్ మ‌న‌సు పెట్టి ప‌ని చేశారు. ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘విరూపాక్ష టీమ్‌కి కంగ్రాట్స్‌. వారెంత క‌ష్ట‌ప‌డి,ఇష్ట‌ప‌డి సినిమా చేశారో వారి మాట‌ల‌ను వింటుంటే తెలుస్తుంది. తమ్ముడు తేజ్‌.. నాకెంతో ఆప్తుడు. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్‌మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌టం విరూపాక్ష సినిమా రూపంలో త‌న‌కు స‌క్సెస్ రావ‌టం చాలా ఆనందంగా ఉంది. తేజుకి వ‌చ్చిన ఈ స‌క్సెస్ నాకు వ‌చ్చిన‌ట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ఇద్ద‌రు హీరోలు. రియల్ హీరోలు. ఎందుకంటే దెబ్బ తిన్నా కూడా లేచి నిల‌బ‌డి స‌క్సెస్ కొట్టారు. సినిమాను రాత్రి చూసిన‌ప్పుడు అయితే నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చే సినిమా ఇది. అన్ ప్రెడిక్ట‌బుల్ మూవీ. చాలా డీటెయిల్డ్‌గా సినిమా ఉంది. సినిమాను సౌండ్‌తో కొట్టారు. అజ‌నీష్‌గారికి బ్యాగ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్‌. టెక్నిక‌ల్ ఫిల్మ్‌. కార్తీ క్ ఇంకా మంచి సినిమాలు తీయాలి. సంయుక్తామీన‌న్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేశారు. త‌న రూపంలో మంచి ఆర్టిస్ట్ దొరికింది. అజ‌య్‌, ర‌వి స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమాకు అంద‌రూ ప్రాప‌ర్‌గా సెట్ అయ్యారు. అంద‌రూ థియేటర్‌లోనే సినిమా చూడండి గొప్ప ఎక్స్‌పీరియెన్స్ వ‌స్తుంది. ప్ర‌సాద్‌గారు పాజిటివ్ ప‌ర్స‌న్‌. ఆయ‌న‌తో పాటు బాపినీడు, సుకుమార్‌గారికి అభినంద‌న‌లు. అన్నీ లాంగ్వేజెస్‌లో సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ కార్తీక్ దండు మాట్లాడుతూ ‘‘విరూాపాక్ష సినిమాను స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్‌. మా టీమ్‌ని అభినందించ‌టానికి వ‌చ్చిన మారుతిగారికి, గోపీచంద్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాలో మేజ‌ర్ టెక్నిక‌ల్ గురించి అంద‌రూ బాగా మాట్లాడారు. అయితే నేను కొందరి గురించి చెప్పాల‌నుకుంటున్నాను. వారిలో మా కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ రజినీగారు. అలాగే మా ఎడిట‌ర్ న‌వీన్‌గారు. ఆయ‌న‌కు నేను మూడు గంట‌ల సినిమా ఇస్తే ఆయ‌న ఎక్క‌డా ఎలాంటి ఎమోష‌న్ మిస్ కాకుండా దాన్ని రెండు గంట‌ల ఇర‌వై నాలుగు నిమిషాల‌కు ఎడిట్ చేసి ఇచ్చారు. అజ‌నీష్‌గారు గ్రేట్ వ‌ర్క్ ఇచ్చారు. అది కేవ‌లం ఆరున్న‌ర గంట‌ల్లోనే చేయ‌టం చాలా గొప్ప విష‌యం. సౌండ్ డిజైన్ చేసిన రాజా కృష్ణ‌, స‌చిన్ ల‌కు థాంక్స్‌. ఎక్స్‌ట్రార్డిన‌రీ ఔట్‌పుట్ ఇచ్చారు. మా డైరెక్ష‌న్ టీమ్ నా బ‌లం. వాళ్ల‌తో పాటు స‌తీష్ బొట్ట‌గారికి థాంక్స్‌. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను’’ అన్నారు.

హీరోయిన్ సంయుక్తా మీన‌న్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సక్సెస్‌లో నాకు వ‌స్తున్న స్పంద‌న‌కు కార‌ణం మా డైరెక్ట‌ర్ కార్తీక్‌గారే. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పాటు కోటి, గాయ‌త్రి వంటి వాళ్లు చాలా మంది నాకు స‌పోర్ట్‌గా నిలిచారు. ప్రొడ‌క్ష‌న్ టీమ్‌కి థాంక్స్‌. క‌రుణాక‌ర్ మాస్ట‌ర్‌గారికి థాంక్స్‌. చిన్మ‌యి, మోనా స‌హా అంద‌రికీ థాంక్స్‌. నా ప‌ర్స‌న‌ల్ టీమ్ కూడా అండ‌గా నిల‌బ‌డటంతో నేను నా వ‌ర్క్‌పై పోక‌స్ పెట్ట‌గ‌లిగాను’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌నీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సినిమా స‌క్సెస్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. ఈ స‌క్సెస్ ఇచ్చిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. డైరెక్ట‌ర్ కార్తీక్ విజువ‌లైజ్ చేసిన దానికి మ్యూజిక్ తోడైంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో నేను ఫ‌స్ట్ చేసిన మూవీ ఇది. కొత్త స్టైల్‌లో చేశాను. ఈ సినిమాలో మా ఐడియా వ‌ర్కవుట్ అయినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. నిర్మాత ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. ఈ స‌క్సెస్‌లో నన్ను భాగం చేసిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, అజ‌య్‌, బ్ర‌హ్మాజీ, ర‌వి కృష్ణ, క‌మ‌ల్ కామ‌రాజు, సాయిచంద్‌ త‌దిత‌రులు మాట్లాడి సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *