”శాకుంతలం సినిమా చూశాను. అత్యంత అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌గారితో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా. ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అని అన్నారు ప్రముఖ కథానాయిక సమంత.

సమంత టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. గుణ టీమ్‌ వర్క్స్ నిర్మించింది. ఈ ఏప్రిల్‌ 14న విడుదల కానుంది శాకుంతలం. నీలిమ గుణ నిర్మాత. గుణశేఖర్‌ రచించి, దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలోని…

మల్లికా మల్లికా మాలతీ మాలికా

చూడవా చూడవా ఏడినా ఏలికా,

హంసికా హంసికా జాగులే చేయక

పోయిరా పోయిరా రాజుతో రాయికా,

అతనితో కానుకా ఈయనా నేనికా

వలపుకే నేడొక వేడుకే కాదా… అంటూ సాగే పాటను శుక్రవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‌ అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది. మణిశర్మ కూర్చిన బాణీకి అందంగా న్యాయం చేశారు సింగర్‌ రమ్య బెహరా. పాట వింటున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపించిందో, స్క్రీన్‌ మీద చూసినప్పుడు అంతే ఇంపుగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లిక మల్లిక పాట విజువల్‌ ఫీస్ట్.

ఈ పాట గురించి దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ”మల్లికా మల్లికా పాటకు యూనిట్‌లోనూ స్పెషల్‌ అభిమానులున్నారు. సమంతగారికి ఈ పాట ఇష్టమని ఆమె ఇటీవల ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. రికార్డింగ్‌ సమయంలో ఎంతగా ఆస్వాదించామో, ఈ పాటను తెరమీద చూసుకున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. వెన్నెల, హంసలు, శ్వేతవర్ణ దుస్తుల్లో సమంత, పువ్వుల అలంకరణలు, చుట్టూ పరిసరాలు, అక్కడి ముని కన్యలు… ఈ పాట బిగ్‌ స్క్రీన్‌ మీద మరో రేంజ్‌లో అలరిస్తుందనే నమ్మకం ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఈ నెల 14న శాకుంతలం సినిమాను ప్యాన్‌ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ”యూత్‌కి బాగా నచ్చే పాట మల్లికా మల్లికా. రమ్య బెహర అద్భుతంగా ఆలపించారు. విన్న ప్రతి ఒక్కరూ బావుందన్నారు. ఇప్పుడు వీడియో సాంగ్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఈ పాట ఇంకా గొప్పగా ఉంటుంది. హంసలు, పువ్వుల లతలు, వనం, పాటలో సమంత ముఖ కవళికలు అందరినీ ఆకట్టుకుంటాయి” అని అన్నారు.

ఏప్రిల్‌ 14న విడుదల కానుంది శాకుంతలం.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శేఖర్‌.వి.జోసెఫ్‌, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్: అశోక్‌, కాస్ట్యూమ్స్: నీతాలుల్లా, వీఎఫ్‌ఎక్స్: అళగర్‌సామి, పాటలు: చైతన్యప్రసాద్‌, శ్రీమణి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, అడిషనల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: టబ్బీ, యాక్షన్‌: వెంకట్‌, కింగ్‌ సాలమన్‌, ఎస్‌ఎఫ్‌ఎక్స్: జె.ఆర్‌.ఎతిరాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: హేమాంబర్‌ జాస్తి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: యశ్వంత్‌, పీఆర్‌ఓ: వంశీ కాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *