ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’.ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచగా అద్భుతమైన మెలోడీగా ఏకంగా 20మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మరో బ్యూటీఫుల్ సాంగ్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది మూవీ టీమ్.

‘దేవరాజా’అనే పదాలతో ప్రారంభం కాబోతోన్న ఈ గీతాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నారు. మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాల్ చేత ఈ రెండో పాటను పాడించడం విశేషం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా పాటలాగా ఆర్య దయాల్ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు. ఏప్రిల్ 3న ఈపాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో కోసం భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఒక సెట్ ను నిర్మించారు. మొదటి పాటలాగానే ఈ రెండో పాట కూడా ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించాడు.

త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు. టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *