– దిల్ రాజుగారి వంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే అది మ‌న మూర్ఖ‌త్వ‌మే అవుతుంది: గుణ శేఖ‌ర్‌

– ఏప్రిల్ 14 కోసం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను: నిర్మాత నీలిమ గుణ‌

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. మంగళవారం ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సమంతగారు ఈ 3D ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కి రావాల్సింది. కానీ రాలేక‌పోయారు. అయితే ఆమె మ‌న‌సంతా ఇక్క‌డే ఉంది. శాకుంత‌లం సినిమాను 3D టెక్నాల‌జీలోకి మార్చాల‌నే ఆలోచన దిల్‌రాజుగారిదే. అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఇప్పుడు త్రీడీ ట్రైల‌ర్ చూస్తుంటే ఆయ‌న ఆలోచ‌న ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతుంది. మ‌న మైథాల‌జీని ఇలా త్రీడీలో సినిమా చేయ‌టం ఇదే తొలిసారి అనుకుంటా. మ‌న సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. 3Dలో శాకుంతలం సినిమాను ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 14 కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.

ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి మాట్లాడుతూ ‘‘శాకుంత‌లం సినిమా 3Dలోనూ రాబోతుంది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘‘శాకుంతలం’ వంటి గొప్ప సినిమాకు ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ క‌థేంటో మ‌న అంద‌రికీ తెలిసిందే. అయితే గుణ శేఖ‌ర్‌గారు ఈ సినిమాను ఎలా చెబుతారు. టేకాఫ్ ఎలా ఉంటుంది? అనే క్యూరియాసిటీ క‌లిగింది. అయితే క‌థ విన్న త‌ర్వాత‌ ఆయ‌న టేకాఫ్‌కి థ్రిల్ అయిపోయాను. అంద‌రూ ఊహించిన దాని కంటే విభిన్నంగా ప్ర‌తీ నిమిషం సినిమా బావుంటుంది. ఈ సినిమా న‌వ్విస్తుంది. ఏడిపిస్తుంది. న‌వ్విస్తూ ఏడిస్తుంది. ఆలోచింప చేస్తుంది. ఒక అద్భుత‌మైన సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ను మీకు ఇచ్చి థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొస్తుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్‌కు వ‌చ్చేలా చేస్తుంది. శ‌కుంత‌లం పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించింది. ఇక దేవ్ మోహ‌న్ కూడా చాలా గొప్ప‌గా న‌టించాడు. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్ నుంచి గుణ శేఖ‌ర్‌గారు మంచి ఔట్‌పుట్ తీసుకున్నారు. నా ఫ‌స్ట్ సినిమాకే నేను దిల్ రాజుగారి ద‌గ్గ‌ర ప‌ని చేయాల్సింది. ఇప్ప‌టికీ కుదిరింది. గేమ్ చేంజర్‌కి కూడా నేను వ‌ర్క్ చేస్తున్నాను. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన గుణ శేఖ‌ర్‌గారికి, దిల్ రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఇంతింతై వ‌టుడింతై అనే స్టైల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుకుంటూ వ‌చ్చేశాం. నేను కూడా నిర్మాత‌గా 50 సినిమాలు చేసేశాను. త‌మిళంలో ఈ ఏడాది వారిసు చేశాను. అలాగే ఇక్క‌డ కూడా బ‌ల‌గం సినిమాతో స‌క్సెస్ కొట్టాం. నెక్ట్స్ గేమ్ చేంజ‌ర్ కూడా రాబోతుంది. ఈ మ‌ధ్య‌లో శాకుంత‌లం సినిమా వ‌స్తుంది. నిజానికి గుణ శేఖ‌ర్‌గారు స‌మంత‌తో ఈ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నేను లేను. అయితే స‌మంత మేనేజర్ మ‌హేంద్ వ‌చ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్‌.. మీరు క‌థ వింటే బావుంటుందన్నారు. స‌రేన‌ని క‌థ విన్నాను. అంద‌రూ నేను గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ చేయ‌టానికి ఈ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నేను సెల్ఫిష్‌గా ఈ సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. అలాంటి గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే నేను ఇందులో పార్ట్ అయ్యాను. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. కానీ నేను మాత్రం గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ కావాలి. నేను కూడా నేర్చుకోవాల‌ని జాయిన్ అయ్యాను. బాహుబ‌లితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే తెలుగు సినిమాల‌ను ఇంకా ప్ర‌పంచానికి చూపిస్తూ ఉండాల‌నే ఉద్దేశంతో నేను వేసిన మొద‌టి అడుగు శాకుంత‌లం.బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా.. విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా తెరెక్కింది. ఓ థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. ఏప్రిల్ 14న ఫ్యామిలీస్ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మ‌న నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌కు మ‌న క‌థ తెలియాలి. అందుక‌నే ఈ స‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ 14న మా శాకుంత‌లం సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంది. నాకు సినిమా గురించి ఇంకా నేర్పించినందుకు గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌. ఈ మూవీ వ్య‌వ‌థి 2 గంట‌ల 19 నిమిషాలు. ఈ టైమ్‌లో ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా బోర్ కొట్టించ‌కూడ‌దు. అదే పెద్ద చాలెంజ్‌. దాన్ని మనం ఎచీవ్ చేశాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘ఇది స‌మంత‌గారి శాకుంత‌లం. ఆమె ప్రాణం పెట్టి శకుంత‌ల పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. రేపు ఫ‌స్ట్ ఫ్రేమ్ నుంచి చివ‌రి ఫ్రేమ్ వ‌ర‌కు చూస్తారు. ఏప్రిల్ 14న మీరు సినిమా చూసి ఏం మాట్లాడాల‌నుకుంటున్నారో వినాల‌ని ఎదురు చూస్తున్నారు. మ‌హాభారతంలో దుష్యంతుడు, శ‌కుంత‌ల పాత్ర‌లను ఆధారంగా చేసుకుని కాళిదాసుగారు అభిజ్ఞాన శాకుంత‌లం రాశారు. దాన్ని విజువ‌ల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్ర‌మంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్ర‌వైజేష‌న్ చేశాం త‌ప్ప‌.. దాదాపు 90 ఒరిజిన‌ల్ క‌థ‌నే సినిమాగా తీశాం. ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచులు మామూలుగా లేవు. కంటెంట ప‌రంగా ఆడియెన్స్ మ‌న కంటే చాలా ముందున్నారు. ఆడియెన్స్‌ను ఇంప్రెజ్ చేయ‌ట‌మే నా చాలెంజ్‌. ఏప్రిల్ 14న వ‌స్తున్న ఈ మూవీ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటుంది.

దిల్‌రాజుగారు నిత్య విద్యార్థి. ప్ర‌తి రోజూ ఆయ‌న కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంటారు. ఆయ‌న నా ద‌గ్గ‌ర నుంచి ఏం నేర్చుకున్నారో నేను కూడా ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయ‌న బ‌లగం సినిమాను నిల‌బెట్ట‌డానికి ట్రాక్ట‌ర్ ఎక్కి ట్రావెల్ అయ్యారు. అలాగే గేమ్ చేంజ‌ర్ సినిమాలో శంక‌ర్‌గారికి ద‌న్నుగా నిల‌బ‌డ్డారు. తెలుగు సినిమా ఈరోజు ఇలాగా వెలిగిపోతుందంటే దిల్‌రాజుగారిలాంటి నిర్మాత‌లే కారణం. స‌మంత‌గారితో ఈ సినిమా చేయాల‌న‌కున్న‌ప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావ‌టానికి చాలా మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. అయితే దిల్ రాజుగారు పార్ట్ అవుతార‌న‌గానే నేను ఆస‌క్తి చూపించాను. అందుకు కార‌ణం మేక‌ర్‌గా ఓ సినిమాను చూసి ఆయ‌న చెప్పేయ‌గ‌ల‌రు. ఆయ‌న‌లాంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే మా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది ఇది. ఆయ‌న ఎగ్జిబిట‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌. ఆడియెన్స్ ప‌ల్స్ తెలిసిన నిర్మాత‌. ఆయ‌న్ని వాడుకోవాల్సిన అవ‌స‌రం మాకు ఉంది’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *