రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పించనున్న “స్లమ్ డాగ్ హజ్బెండ్”

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఇది మంచి కంటెంట్ ఉన్న ఓ చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం. ఇక మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. గతంలోనే అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ కు మంచి స్పందన వచ్చింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన ఫ్రస్ట్రేషన్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ పై సాగే ఈ పాటలో స్టార్ యాక్టర్ సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంతకు ముందు ఓ పిట్టకథ చిత్రంతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ రావుకు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్నా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :

ఎడిటర్ – వైష్ణవ్ వాసు,

సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి

సంగీతం – భీమ్స్ సిసిరోలియో

సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి

పీఆర్వో – జీఎస్కే మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి

బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ

సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల

ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం

నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *