హీరో, బిగ్ బాస్ 4 (తమిళ్) విన్నర్ గానే కాక సామాజిక కార్యకర్తగా కూడా తమిళనాడు లో ఆరి అర్జునన్ అందరికీ తెలుసు. తాజాగా మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ అయిన నన్బన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి బ్రాండ్ అంబాసడర్ గా అతనిని ప్రకటించింది.

నన్బన్ ఫౌండేషన్, పేరుకి తగ్గట్టుగానే స్నేహితుడిలా నిష్కల్మషంగా బలహీన వర్గాల కి ఏమీ ఆశించకుండా ఆర్ధిక స్వాతంత్య్రాన్ని, బ్రతుకు తెరువుని అందించే ఎన్నో ఆలోచనలకి, ఆచరణలకి అంకురార్పణ చేశారు. వాటికి వెన్నుదన్నుగా ఉండే వారి సంస్థల్లో నన్బన్ వెంచర్స్, నన్బన్ రియాల్టీ, నన్బన్ చోళ ల్యాండ్ హోల్డింగ్, నన్బన్ ప్రైవేట్ ఈక్విటీ, నన్బన్ ఈ.ఎస్.జి సొల్యూషన్స్, నన్బన్ ఎంటర్టైన్మెంట్ ముఖ్యమైనవి.

యూఎస్ఏ లో స్వీయ నిధులు సమకూర్చుకునే ఒక ఎన్.జి.ఓ ఈ నన్బన్ ఫౌండేషన్. వారి కార్యాచరణలో స్పోర్ట్స్, ఆర్ట్స్ – కల్చర్, గ్రీన్ ప్లానెట్, హెల్త్ కేర్ వంటివి సామాన్యులకి కూడా అందుబాటులో ఉండేలా చేయడం ఒక భాగం. అలాంటి 35 కి పైగా ప్రాజెక్ట్స్ ని ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు.

తాజాగా, ఇదే ఫౌండేషన్ ద్వారా భారత దేశంలో జరిపించనున్న వారి కార్యకలాపాలకు బ్రాండ్ అంబాసడర్ గా తమిళ సినీ పరిశ్రమలో 15 ఏళ్లుగా ఉంటూ 16 కోట్ల ఓట్లతో బిగ్ బాస్ 4 (తమిళ్) విన్నర్ గా గెలిచిన ఆరి అర్జునన్ ని ఎంచుకోవడం చాలా మంచి విషయం.

“సేవా కార్యక్రమాలతో, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తమ సంస్థ ఆశయాలకు దగ్గరగా ఉండే వ్యక్తిత్వం ఉండే తనతో పని చేయడం, బ్రాండ్ అంబాసడర్ అవడం చాలా సంతోషంగా ఉంది” అని సంస్థ చైర్మన్ – ఫౌండర్ గోపాల కృష్ణ (జి.కె), ప్రెసిడెంట్ మ్యానేజింగ్ పార్ట్నర్ నరైన్ రామస్వామి, కో ఫౌండర్లు మని షణ్ముగం, శక్తివేల్ పళని ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *