యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “అయ్యో ఏంటో నాకు” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా స్వీకర్ అగస్తి పాడారు. ‘అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే’ అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట.

ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఆల్బమ్ ఛాట్ బస్టర్ అవుతోంది. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “కళ్యాణం కమనీయం” ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *