యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగిందీ పాట.

ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ పాటలు అందమైన సంగీత సాహిత్యాలతో ఆకట్టుకుంటున్నాయి. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *