Waltaire VeerayyaMovies..సంక్రాంతి పండుగకు పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరిది పైచేయవుతుందనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టారు అనేది ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా పోటీపడుతున్నాయి సరిగా నెల రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగ తో పాటు సినిమాల పండగ వాతావరణం నెలకొనబోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

మరొకవైపు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే . మరొక పక్క తమిళ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు కూడా డబ్బింగ్ అయి తెలుగులో విడుదల కాబోతోంది. ఇలా ఈ నాలుగు సినిమాలతో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి నలుగురు బడా హీరోలు సంక్రాంతి పండుగకు పోటీ పడుతున్న నేపథ్యంలో వారి సినిమా బడ్జెట్ల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం అన్నిటికంటే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం వారసుడు . నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రూ.100 కోట్ల పారితోషకం ఒక్క విజయ్ కే ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా తర్వాత అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. 140 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు.

మరోపక్క బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను రూ.110 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు రూపొందిస్తున్నారు.. అజిత్ నటించిన తునివు సినిమా రూ.100 కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం. ఇకపోతే వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలు ఏ విధంగా సక్సెస్ అందుకుంటాయో చూడాలి. మొత్తంగా రూ.600 కోట్ల బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *