Venkatesh.. విక్టరీ వెంకటేష్.. వైవిద్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనను మరొకసారి కొత్తగా ఆవిష్కరిస్తూ ఎప్పటికప్పుడు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ (Venkatesh) కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని.. భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈయన తర్వాత తరంలో వచ్చే నిర్మాతల వారసులందరికీ రోల్ మోడల్ అని చెప్పాలి. హీరో తర్వాత చాలామంది నిర్మాతల కొడుకులు ఇండస్ట్రీ లోకి వచ్చారు కానీ వెంకటేష్ సక్సెస్ అయినంతగా వారు సక్సెస్ కాలేకపోవడం గమనార్హం

ఇకపోతే ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటి అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అలా 1971లో తన తండ్రి నిర్మించిన ప్రేమ్ నగర్ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణ పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత 1986న కలియుగ పాండవులు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇకపోతే వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా తర్వాత నటించిన ఏ సినిమాలో కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా బ్రహ్మపుత్రుడు సినిమాని నిర్మించారు.

Tollywood Heroes Child Artists | Mahesh Babu Child Artist | Jr NTR Child Artist | Allu Arjun As Child Artist | Nithya Menen Child Artist | Venkatesh As Child Artist | Manchu

ముఖ్యంగా ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు వెంకటేష్ . అంతేకాదు ఈయన తొలిసారి నటించినా రీమేక్ భారతంలో అర్జునుడు హిందీలో విజయం సాధించిన అర్జున్ ఆధారంగా తెరకెక్కింది. కానీ ఇది పరాజయం పాలయింది. తర్వాత హిందీ నసీబ్ ఆధారంగా వెంకటేష్ త్రిమూర్తులు సినిమా రూపొందిగా ఇది ఆవరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత తమిళ చినతంబి ఆధారంగా రూపొందిన చంటి 1992లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

Click here for follow Pakkafilmy in Google news

ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వరుసగా చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు వంటి రీమేక్ చిత్రాలలో నటించారు వెంకటేష్. ఇక తర్వాత అంచెలెంచెలుగా ఎదుగుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో నారప్ప సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *