Actor Sunil Wife : తెలుగు నటుడు సునీల్ భార్య ఎవరో తెలుసా? తను ఏం చేస్తుందో తెలుసా? | The Telugu NewsSunil.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టి.. హీరోగా , విలన్ గా ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా తనను తాను మార్చుకొని ప్రేక్షకులను అలరించిన ఏకైక నటుడు కమెడియన్ సునీల్ (Sunil) అని చెప్పవచ్చు… అయితే హీరోగా ఎంత సక్సెస్ అయినా..విలన్ గా ప్రేక్షకులను ఎంత భయపెట్టినా సరే తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల ఏకైక కమెడియన్ అనడంలో సందేహం లేదు. తన నటనతో.. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఎటువంటి వారినైనా సరే నవ్వించగల కెపాసిటీ ఆయన సొంతం.. అందుకే సునీల్ అంటే చాలామందికి మంచి గౌరవమే కాదు డిమాండ్ కూడా.

ఒక్కొక్కసారి తన సినిమాల ద్వారా యంగ్ హీరోలతో సమానంగా పారితోషకం కూడా తీసుకుంటూ ఉంటారు. కొన్ని పాత్రలకు ప్రత్యేకించి పెట్టింది పేరుగా సునీల్ మిగిలిపోయారు. దాదాపు 180 చిత్రాలలో హాస్యనటుడిగా చేసిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. భీమవరం దగ్గర పెద్దపల్లి గ్రామంలో 1974 ఫిబ్రవరి 28న జన్మించిన సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సునీల్ కి ఐదు సంవత్సరాల వయసు ఉండగా మరణించడంతో.. తల్లికి ఆ ఉద్యోగం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఊర్లోనే పెరిగిన సునీల్ అక్కడే నాలుగవ తరగతి చదివి ఆ తర్వాత ఇంటర్ వరకు భీమవరంలో పూర్తి చేశాడు.

    Click here for follow Pakkafilmy in Google news

చిన్నప్పటినుంచే ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో కలలు కన్న ఈయన భీమవరం కాలేజీలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరాడు. ఫ్రెండ్స్ తో సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఒకసారి చిరంజీవి లాగా డాన్స్ చేయాలని భావించి డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కూడా చేరాడు. 1994లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచనతో తన బైక్ అమ్మేసి ఆ డబ్బులతో హైదరాబాద్ వచ్చిన సునీల్(Sunil).. ఫిలింనగర్ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram sreenivas) ఆయన మిత్రుడు మురళి లతో కలిసి రూమ్ షేర్ చేసుకున్నారు. అయినా కూడా ఎక్కడెక్కడ తిరిగినా అవకాశాలు రాకపోవడంతో తిరిగి భీమవరం వచ్చేసిన ఈయనకు మళ్లీ కుటుంబ సభ్యుల ఎంకరేజ్మెంట్ తో హైదరాబాద్ వచ్చాడు. అలా రెండు సంవత్సరాల తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చిన్న పాత్ర చేశాడు.

నువ్వు నేను సినిమాకు ఈయనకు హాస్యనటుడిగా నంది అవార్డు కూడా లభించింది. ఇక సినిమాలలో సెటిల్ అయిన తర్వాత పెద్దల సమక్షంలో శృతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. వీరికి ఒక పాప , బాబు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *